ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ సమావేశంలో ఎన్నిక సందర్భంగా ఆప్, బీజేపీ కార్పిరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి నిలిచిపోయింది.
తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్‌కు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవడంతో ఆయన హంగామా సృష్టించారు. తిరువళ్లూరులో కూర్చోవడానికి కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు మంత్రి ఎస్ఎం నాసర్ డీఎంకే పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు.
'గూఢచారి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు అద్భుత విజయాలను సాధించింది. హిట్స్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.