YS Jagan: అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డ్.. ఈ 18 నెల్లలో మీరు చేసి అప్పు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: 2014 కల్లా అప్పులు రూ.లక్షా 47 వేల 717 కోట్లని.. బాబు దిగిపోయే నాటికి రూ.3లక్షల 90 వేల 247 కోట్ల అప్పులు చేశారని మాజీ సీఎం జగన్ అన్నారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7లక్షల 21 వేల 918 కోట్లని.. కానీ.. రూ.9లక్షల 74 వేల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయవచ్చా? అని ప్రశ్నించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. 50 ఏళ్లకే పెన్షన్ అని మరొక హామీ ఇచ్చారని.. రాష్ట్రంలో 50 నుంచి 59 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారన్నారు.. ఈ మూడు బడ్జెట్లలో మూడు ప్రధాన హామీలకు అతీగతీ లేదన్నారు.. సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపించి సూపర్ హిట్ అని ఎలా అంటారని ప్రశ్నించారు..
READ MORE: OpenAI vs Anthropic: ప్రధాని మోడీ ముందే.. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈవోల మధ్య రగడ..
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
“ప్రతీ నెల పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రతీ మీటింగ్‌కి 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు.. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో పెన్షన్లు 66,34,372.. ఈనెల చంద్రబాబు ఇచ్చిన పెన్షన్లు 60, 96,108.. ఐదు లక్షలకు పైగా పెన్షన్లు కట్ చేశారు.. ఈనెల ఇచ్చిన మొత్తం 2,632 కోట్లు.. ఏడాదికి కావాల్సింది 31,584 కోట్లు.. ఈ ఏడాది బడ్జెట్ పెన్షన్ కోసం చేస్తున్న ఖర్చు 27, 719 కోట్లు.. ఈ డబ్బు మొత్తం 53, 50, 115 పెన్షన్లకు మాత్రమే సరిపోతుంది.. మరి మిగతావాళ్ళవి ఏం చేస్తారు.. దాదాపు ఏడు లక్షల పెన్షన్లకు కేటాయింపులు ఎలా చేస్తారు.. తల్లికి వందనం పేరిట మరో మోసం.. రాష్ట్రంలో UDISE డేటా ప్రకారం మా హయాంలో బడికి పోయే పిల్లలు 87, 41,885 పిల్లలు.. ఒక్కొక్కరికీ 15 వేల చొప్పున ఇస్తే 13, 112 కోట్లు ఖర్చు అవుతుంది.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 8,456 కోట్లు.. దాదాపు 20 లక్షల మంది పిల్లలకు ఎగగొట్టారు.. ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడకు అయినా వెళ్లవచ్చు అని చెప్పారు.. ఏపీఎస్ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉంటే 5 సర్వీసులకు పరిమితం చేశారు.. ఉచిత గ్యాస్ అని మరో మోసం.. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్స్ 1.59 కోట్లు.. ఒక్కొక్కరికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు.. ఏడాదికి మొత్తం నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌లో కేటాయించింది 2600 కోట్లు.. గ్యాస్‌లో కూడా బాకీ పెట్టారు.. వ్యవసాయ రంగానికి అన్నదాత సుఖీభవ అన్నారు.. మా హయాంలో చెప్పిన దాని కన్నా పెంచి ఇచ్చాం.. కేంద్రం ఇచ్చేది కాకుండా మేము 20 వేలు ఇస్తామని చెప్పారు.. 10,717 కోట్లు ఏడాదికి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి ఇవ్వాలి.. మొత్తం రెండేళ్లకు ఒక్కొక్కరికీ 40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 10 వేలు ఇచ్చారు.. చాలా మందికి పథకం ఎగరగొట్టారు.. వ్యవసాయ మంత్రి 6300 కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు.. 21 వేలు ఇవ్వాల్సి ఉంటే నాలుగు వేల కోట్లు ఇచ్చారు.. వరుసగా మూడవ బడ్జెట్ లో కూడా కౌలు రైతుకు సున్నా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 17 సార్లు విపత్తులు సంభవించాయి.. చంద్రబాబు పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ పథకం అందుబాటులో లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వైసీపీ హయంలో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడం వల్ల 54.55 లక్షల మంది రైతులకు జరిగిన మేలు 7802 కోట్లు.. గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఏ పంటకు ధర లేకపోయినా ప్రభుత్వం చేసింది శూన్యం.. మా హయంలో 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తెచ్చాం.. ప్రతీ పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించాం..” అని మాజీ సీఎం జగన్ అన్నారు.
READ MORE: Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!