సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో ఓ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అక్రమంగా దొంగచాటున నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పారిశ్రామిక వేత్తలతో బిజీగా గడిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు.
ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కంటి చూపు జబ్బు వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్‌గోపాల్‌పేట్‌లో ఉన్న డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్టు సర్క్యూ్ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.