Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!
- సూపర్-8 పోరుకు సిద్దమవుతోన్న టీమిండియా
- జట్టును వేధిస్తోన్న టాప్ ఆర్డర్ వైఫల్యం
- సూపర్-8కు ముందు 'తిలక్' తలనొప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Form raise concerns Before T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశను డిపెండింగ్ ఛాంపియన్ భారత్ అజేయంగా ముగించింది. అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్‌లను ఓడించి గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది. ఇక సూపర్-8 పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. తొలి సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ తర్వాత అంత ఆధిపత్యం చలాయిస్తోన్న టీమ్ ఏదన్నా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. ప్రస్తుతం సూర్య సేన వరుస విజయాలు సాధిస్తున్నా.. టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, తెలుగు ఆటగాడు తిలక్ వర్మల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా తిలక్ వర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆసియా కప్ 2025 ఫైనల్లో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ మినహా.. అతని గణాంకాలు గొప్పగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం, ఎక్కువ డాట్ బాల్స్ ఆడటం తిలక్ ఆటలో ప్రధాన బలహీనతలుగా విశ్లేషకులు చెబుతున్నారు. టీ20 ఫార్మాట్లో స్ట్రైక్‌రేట్ అత్యంత కీలకం. తిలక్ స్ట్రైక్‌రేట్ కూడా తక్కువగా ఉండడం టీమ్ మేనేజ్మెంట్ను ఆలోచనలో పడేస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026లో మూడు మ్యాచులలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూన నెదర్లాండ్స్ కూడా 27 బంతులు ఆడి 31 రన్స్ మాత్రమే చేశాడు.
Also Read
- Shreyas Iyer: "తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే".. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
- Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Basit Ali: 'తిలక్ వర్మనే అసలైన హీరో'.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తిలక్ వర్మకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సీనియర్ శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వకుండా.. తిలక్‌ను కొనసాగించడం కూడా మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. యువ ఆటగాడికి అవకాశాలు ఇస్తూ పెద్ద టోర్నీలకు సిద్ధం చేయాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తిలక్ మాత్రం దూకుడైన ఇన్నింగ్స్ ఆడడం లేదు.
Also Read: Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్‌లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి బలమైన జట్లు ఉన్నాయి. సెమీస్ చేరాలంటే.. వేగంగా పరుగులు చేయడం చాలా కీలకం. ఈ సమయంలో స్ట్రైక్‌రేట్ సమస్య కొనసాగితే.. అది జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. మరి ఇప్పటికైనా తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్ మెరుపుపర్చుకుంటాడో లేదో చూడాలి. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడినా.. అతడిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చు. లేదంటే టీమ్ కాంబినేషన్‌పై మేనేజ్మెంట్ మరోసారి ఆలోచించే పరిస్థితి రావచ్చు.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!