KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Marriage: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అతియా శెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా రాహుల్ అతియాశెట్టిని వివాహమాడాడు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, క్రికెటర్ ఇషాంత్ శర్మ దంపతులు, వరుణ్ ఆరోన్ తదితరులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ పూర్తయిన తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశముంది.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
Vadakupatti Ramasamy: సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’
నూతన వధూవరులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా అతియా తన ఇన్‌స్టాలో రాహుల్‌తో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. ఈ రోజు తమకు చాలా విలువైన రోజు అని.. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటానని.. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యామని.. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చిందని.. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నామని అతియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
#WATCH: अथिया शेट्टी और के.एल. राहुल ने सुनील शेट्टी के खंडाला फार्महाउस में शादी की। pic.twitter.com/xBiwRufqtO
— ANI_HindiNews (@AHindinews) January 23, 2023
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!