Epstein Files: బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..
- సంచలనంగా మారిన ఎప్‌స్టీన్ ఫైల్స్..
- మాజీ బ్రిటన్ యువరాజు ఆండ్రూ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తొలి వికెట్ పడింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ( ఆండ్రూ మౌంట్‌బ్యాటెన్-విండ్సర్)ను గురువారం బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం అరవై ఏళ్ల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు వెల్లడించారు. యూకే చట్టాల ప్రకారం, అతడి పేరును పేర్కొనలేదు. బ్రిటిష్ మీడియా మొత్తం ఆ వ్యక్తి ఆండ్రూయేనని ధ్రువీకరించింది. “జాతీయ మార్గదర్శకాల ప్రకారం, అరెస్టు చేసిన వ్యక్తి పేరును మేము పేర్కొనబోము” అని పోలీస్ ప్రకటన తెలిపింది. సమగ్ర అంచనా తర్వాత ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: OpenAI vs Anthropic: ప్రధాని మోడీ ముందే.. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈవోల మధ్య రగడ..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
‘‘సమగ్ర అంచనా ప్రకారం, ప్రభుత్వ పదవీకాలంలో దుష్ప్రవర్తన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాము’’ అని పేర్కొంది. ఆండ్రూ 2010లో లైంగిక నేరస్తుడి తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు వాణిజ్య నివేదికలు పంపాడని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరాన్ని దర్యాప్తు చేయడానికి మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు యూకే పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం తెల్లవారుజామున ఆరు పోలీసుల కార్లు, 8-10 మంది సాధారణ దుస్తుల్లో ఉన్న అధికారులు సాండ్రిగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్‌కు వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది. ఆండ్రూ 66వ పుట్టిన రోజునే అరెస్ట్ జరగడం గమనార్హం. ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఆండ్రూ ఒక అమ్మాయిపై ఉన్నట్లు ఫోటోలు విడుదలయ్యాయి. మహిళ నడుము, వక్షోజాల భాగాలపై చేతులు ఉంచినట్లు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. 2010-11 కాలంలో ఆండ్రూ సింగపూర్, హాంకాంగ్, వియత్నాం సందర్శన వివరాలను, పెట్టుబడి అవకాశాల సీక్రెట్ నివేదికల్ని ఎప్‌స్టీన్ కు షేర్ చేసినట్లు తాజా డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఈ కాలంలో ఆయన ట్రేడ్ ఎన్వాయ్‌గా పనిచేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!