Google Lyria 3: మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక దుకాణాలు మూసేయల్సిందేనా? మీకు నచ్చిన పాటను సెకన్లలో ‘లిరియా 3’తో సృష్టించండి ఇలా..
- Gemini యాప్‌లో కొత్తగా Lyria 3 మ్యూజిక్ జనరేషన్ ఫీచర్ అందుబాటులోకి..
- ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన Google DeepMind..
- యూజర్లు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటో, వీడియో అప్‌లోడ్ చేస్తే చాలు..
- 30 సెకన్ల నిడివి గల ఒరిజినల్ పాటను రెడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Lyria 3: టెక్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేసే గూగుల్.. ఇప్పుడు సంగీత ప్రియుల కోసం ఓ అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చింది. గూగుల్ డీప్‌మైండ్ (DeepMind) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన మ్యూజిక్ మోడల్ ‘లిరియా 3’ (Lyria 3) ఇప్పుడు జెమిని యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ లేదా ఫోటోతో మీకు నచ్చిన ఒరిజినల్ పాటను సృష్టించుకోవచ్చు.
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఏమిటీ లిరియా 3?
లిరియా 3 అనేది గూగుల్ అత్యాధునిక జెనరేటివ్ మ్యూజిక్ మోడల్. గత మోడల్స్ కంటే ఇది మూడు ముఖ్యమైన విషయాల్లో మెరుగ్గా పనిచేస్తుంది. అవేంటంటే.. ఇందులో మొదటగా మీరు సాహిత్యం (Lyrics) ఇవ్వాల్సిన పనిలేదు. మీ ఐడియాను చెబితే చాలు, జెమిని అద్భుతమైన లిరిక్స్‌ను రాస్తుంది. ఇక ఆ తర్వాత పాట ఏ స్టైల్‌లో ఉండాలి? వాయిస్ ఎలా ఉండాలి? టెంపో ఎలా ఉండాలి? అనేవి మీరే నిర్ణయించవచ్చు కూడా. ఇక చివరగా.. క్వాలిటీ మ్యూజిక్ తో చాలా సహజమైన, వినడానికి వినసొంపుగా ఉండే మ్యూజికల్ కాంప్లెక్సిటీ ఉన్న పాటలను అందిస్తుంది.
మీరు పాటలను ఎలా సృష్టించవచ్చు?
జెమిని యాప్‌లో పాటలను రూపొందించడం చాలా సులభం. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
టెక్స్ట్ ద్వారా (Text to Track): ఇందులో మీకు కావాల్సిన మూడ్ లేదా స్టైల్‌ను వివరిస్తే చాలు. ఉదాహరణకు “అమ్మ చేసిన వంటల గురించి గుర్తు చేసుకుంటూ ఒక ఎనర్జిటిక్ బీట్ సాంగ్ కావాలి” అని అడిగితే.. జెమిని దానికి తగ్గట్టుగా పాటను రెడీ చేస్తుంది.
Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
ఫోటో లేదా వీడియో ద్వారా: ఇందులో మీ పెంపుడు జంతువు ఫోటో లేదా మీరు వెళ్ళిన ట్రిప్ వీడియో అప్‌లోడ్ చేసి.. “దీనికి సరిపోయే మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ కావాలి” అని అడిగితే చాలు.. విజువల్స్ మూడ్ బట్టి మ్యూజిక్ జనరేట్ అవుతుంది.
ఇలా ఇస్తే జెమిని మీకు 30 సెకన్ల నిడివి గల పాటను అందిస్తుంది. దీనికి తోడు ‘నానో బనానా’ (Nano Banana) మోడల్ ద్వారా ఆ పాట కోసం ఒక ప్రత్యేకమైన కవర్ ఆర్ట్‌ను కూడా సృష్టిస్తుంది.
యూట్యూబ్ షార్ట్స్ కోసం:
ఈ లిరియా 3 టెక్నాలజీని యూట్యూబ్ ‘డ్రీమ్ ట్రాక్’ (Dream Track)లో కూడా గూగుల్ పొందుపరిచింది. దీనివల్ల యూట్యూబ్ క్రియేటర్లు తమ షార్ట్స్ వీడియోల కోసం కస్టమ్ సౌండ్ ట్రాక్ లను, లిరిక్స్ ను సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు.
భద్రత (SynthID):
AI సృష్టించిన సంగీతం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గూగుల్ ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందులో..
SynthID వాటర్‌మార్క్: జెమిని సృష్టించే ప్రతి ఆడియో ట్రాక్‌లో ‘SynthID’ అనే అదృశ్య వాటర్ మార్క్ ఉంటుంది. దీనివల్ల అది AI సృష్టించిన పాట అని సులభంగా గుర్తించవచ్చు.
వెరిఫికేషన్ టూల్: ఏదైనా ఆడియో ఫైల్ గూగుల్ AI ద్వారా తయారైందో లేదో తెలుసుకోవడానికి మీరు జెమినిలోనే చెక్ చేసుకోవచ్చు.
కాపీరైట్: ఇది ఇప్పటికే ఉన్న కళాకారులను అనుకరించదు. కేవలం వారి శైలిని స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త పాటలను మాత్రమే సృష్టిస్తుంది.
Manik Gupta: మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల దాడి.. అంపైర్ మృతి!
ఎవరికి అందుబాటులో ఉంటుంది?
Google అందిస్తున్న ఈ కొత్త Gemini AI ఫీచర్ ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్ వంటి పలు ప్రధాన భాషలకు సపోర్ట్ చేస్తోంది. ఈ సర్వీస్ ఇప్పటికే డెస్క్‌టాప్ వినియోగదారులకు ప్రారంభమై ఉండగా.. మొబైల్ యాప్‌లో కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా గూగుల్ AI ప్లస్, ప్రో, అల్ట్రా వంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు మరింత ఎక్కువ సంఖ్యలో పాటలను సృష్టించుకునే ప్రత్యేక అవకాశం ఉంటుంది. మీ రోజువారీ జీవితంలోని అనుభవాలు, జ్ఞాపకాలను ఒక ప్రత్యేక పాటగా మార్చుకోవాలనుకుంటే gemini.google.com వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించి ప్రయత్నించవచ్చు.
Meet Lyria 3, our latest music generation model from @GoogleDeepMind. 🎶
Now, you can create custom music tracks in the @GeminiApp — just by describing an idea or uploading an image or video. pic.twitter.com/zfRQuAUhyV
— Google (@Google) February 18, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..