Delhi: ఆప్-బీజేపీ పోరు.. మరోసారి నిలిచిపోయిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ సమావేశంలో ఎన్నిక సందర్భంగా ఆప్, బీజేపీ కార్పిరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి నిలిచిపోయింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత సమావేశమయ్యే మొదటి సభలోనే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవలసి ఉన్న సభలో గందరగోళంతో గతంలో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సమావేశాల్లో ఆందోళన నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 134 వార్డుల్లో ఆప్ గెలవగా.. 104 వార్డులకు బీజేపీ పరిమితం అయింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. డిసెంబరు 4న పౌర ఎన్నికలు నిర్వహించగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిగింది.
తొలి సమావేశం జనవరి 6న జరగగా.. మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోకుండానే వాయిదా పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, నామినేటెడ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో గొడవ చెలరేగింది. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ.. నామినేటెడ్ సభ్యుల కన్నా ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం తెలిపింది.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అందాల నటి ఊర్మిళ మటోండ్కర్
మేయర్ పదవికి ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు. బీజేపీ రేఖ గుప్తా పేరును ప్రతిపాదించింది. డిప్యూటీ మేయర్ పదవికి నామినీలు ఆలే మొహమ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్ (ఆప్), కమల్ బాగ్రీ (బీజేపీ)లను ఇరు పార్టీలు ప్రతిపాదించాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు మున్సిపల్ స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యులు కూడా మున్సిపల్ సమావేశంలో ఎన్నుకోబడతారు. జాతీయ రాజధానిలో మేయర్ పదవికి రొటేషన్ ప్రాతిపదికన ఐదు ఒకే-సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళలకు, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరీకి, మూడోది రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. దీంతో ఢిల్లీకి ఈ ఏడాది మహిళా మేయర్ రానున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!