Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు వచ్చేశాయి..! డౌన్ లోడ్ లింక్ మీ మొబైల్ కే.. పూర్తి వివరాలివే.!
- మార్చి 2026 ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల
- మొబైల్ SMS ద్వారా డౌన్‌లోడ్ లింక్ పంపిన బోర్డు
- హాల్ టికెట్‌పై QR కోడ్.. సెంటర్ లొకేషన్ సులభంగా తెలుసుకునే సదుపాయం
- తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్ ద్వారా ఫిర్యాదు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాల్ టికెట్ల ప్రక్రియ పూర్తయింది. మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండటంతో, బోర్డు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 25, 2026 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు, వారి సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల నుండి ధ్రువీకరించిన హాల్ టికెట్లను తీసుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సౌకర్యార్థం వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను SMS ద్వారా కూడా పంపుతున్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్‌లైన్‌లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
ఈసారి సాంకేతికతను జోడిస్తూ బోర్డు కీలక మార్పులు చేసింది. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా , ఖచ్చితంగా గుర్తించడానికి వీలుగా హాల్ టికెట్లపై QR కోడ్ ను ముద్రించారు. దీనిని స్కాన్ చేయడం ద్వారా సెంటర్ లొకేషన్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సంతకం లేదా సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్ టికెట్లు అందిన వెంటనే అన్ని వివరాలు సరిచూసుకోవడం, పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నుంచే ప్రారంభం కానున్న ఈ వార్షిక పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్ధం చేశారు.
Miracle Movie: హెబ్బా పటేల్ కొత్త సినిమా.. ‘మిరాకిల్’ చేద్దాం రండంటున్న హాట్ బ్యూటీ!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు