ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు జయ జయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. ఈ పండుగ రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏమీ మార్చలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక పార్టీలు అనేక ప్రతిరూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం చేసుకుందామంటూ ప్రజలకు తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణమని.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నరసింహ కాటన్ మిల్లులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయకుండా కాటన్ మిల్ యాజమాన్యం నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి జిన్నింగ్ మిల్‌లో టెక్నికల్ సాంకేతిక లోపం రావడంతో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోలు నిలిపివేసినట్లు పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం తెలిపింది.
సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగ్గారెడ్డి నానా హంగామా చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం పోతురాజులతో కలిసి జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు.
ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంట చేతికొచ్చి దానిని అమ్ముకునే సమయంలో వర్షాలు అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.