Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కన్న డ్రైవర్ మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆ ఆర్టీసీ బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ఘటనతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
Read Also: Delhi: విషాదం.. హాస్టల్‌లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి