Telangana Thalli Statue: రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి అంటూ ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిందన్నారు. విగ్రహం రూపు..ఎడమ చేతిలో వరి.. మొక్క జొన్న కంకి.. సజ్జ కంకీ.. మెడ లో కంటే.. చేతికి ఆకుపచ్చ గాజులు.. ఆకుపచ్చ చీర బంగారు రంగు అంచు.. పోరాట స్ఫూర్తిని తెలిపేలా… పిడికిళ్లు తెలంగాణతనం, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు. విగ్రహావిష్కరణ అనంతరం జయ జయహే తెలంగాణ.. గీత రచయిత అందెశ్రీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానించారు.
Read Also: RBI New Governor: ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం