ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట రూ.98 లక్షలను కాజేసి ఎస్.ఎల్.సి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది.
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు చిక్కడపల్లి పోలీసులు.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్, స్కూటీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో స్కూటీపై వెళ్తున్న అత్త, అల్లుడు, కూతురు ఉన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌లో మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సినీ నటుడు మంచు మనోజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి గాయం కావడంతో సతీమణి మౌనికతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు.
దారి తప్పిన భార్యకు బుద్ధి చెప్పాడు ఓ భర్త. ప్రియుడితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆమె ముందే ప్రియుడిని చితకబాదాడు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విసిరేసారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఏలూరు అశోక్ నగర్ అమలోద్భవి స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.