ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
HYDRA Commissioner: హైదరాబాద్‌లోని మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో నిర్మించిన మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీని ఆయన సందర్శించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు […]
ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని.. ఆ రోజు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది
బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు.
తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందువరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని సీఎం తెలిపారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ ఇదంటూ ఆయన కీర్తించారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.