అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38వ షోరూమ్‌ను కర్నూలు రోడ్, ఒంగోలులో 2024 డిసెంబరు 12న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్, ఒంగోలు మేయర్ గందాడ సుజాత, ఒంగోలు 48వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి…
అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలైన తరువాత నుంచి వైసీపీ జగన్‌కు షాక్ లా మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు.
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.