Jakki Mahesh
Author- NTV Telugu-
Strange Laws: ఆ దేశంలో స్నానం చేయకుండా నిద్రపోతే జైలుకే.. ఎక్కడో తెలుసా?
ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఈ చట్టాల ప్రకారం పౌరులు తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతిదీ సజావుగా జరిగేలా చట్టాలు రూపొందించబడ్డాయి. కానీ, కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత […] -
Rishabh Pant: అదే మా పొరపాటు.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!
తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్‌కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో కెప్టెన్ రిషభ్ […] -
Sourav Ganguly: వారి కన్నా భారత టీ20 లీగ్‌కే ఎక్కువ ఆదాయం
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా భారత టీ20 లీగ్‌కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. తాజాగా ఇండియా లీడర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అతడు భారత టీ20 లీగ్ గురించి, టీమ్‌ఇండియాలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ చాలా అభివృద్ధి చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆట ఎంత అభివృద్ధి చెందిందో తాను కళ్లారా చూశానని సౌరభ్ గంగూలీ వెల్లడించారు. తనలాంటి క్రికెటర్లు ఇక్కడ […] -
Russia: గడువు ప్రకారమే ‘ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థ సరఫరా
భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ‘ఎస్-400’ సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. S-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్ణయించుకున్న […] -
Chicago Shootings: చికాగోలో కాల్పుల మోత.. ఈ వీకెండ్‌లో ఐదుగురు మృతి
అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ వారాంతంలో ఇప్పటివరకు చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారు. చికాగోలోని ఓ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరు.. ఎందుకు.. […] -
Weight Lifting: భారత్‌కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు
ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తా చాటారు. మెక్సికో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంక్ష కిషోర్, విజయ్ ప్రజాపతి రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆకాంక్ష.. స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తి.. మొత్తం మీద 127 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. 49 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో […] -
Ukraine: కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా దాడి.. దాదాపు 800 మంది?
ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని […] -
OnePlus: వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది..
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్ వేరియంట్ ఫోన్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే […] -
Russia-Ukraine War: మెక్‌డొనాల్డ్స్ కొత్తపేరుతో రీఎంట్రీ.. ఎగబడిన జనం
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్‌డొనాల్డ్స్‌ను పునఃప్రారంభించారు. దిగ్గజ ఫాస్ట్‌పుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది. […] -
China: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. తైవాన్ జోలికొస్తే యుద్ధమే!
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్ను […]
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!