దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా.. […]
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆయనను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముషారఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వదేశానికి ఆయనను తరలించేందుకు వీలు కల్పిస్తామరి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట […]
సైబర్ నేరస్థులు పంథా మార్చి ప్రజలను వంచిస్తున్నారు. మెట్రోనగరాలతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారిని తమ వాట్సాప్ బృందాల్లోకి చేర్చుకుంటున్నారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మిస్తున్న అక్రమార్కులు వాటిని బాధితులు తీసుకున్నాక లక్షలు కొల్లగొడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ అడ్వొకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వొకేట్‌ను సైబర్ చీటర్స్ వాట్సప్ […]
రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందని.. మరోవైపు విపక్షాల అభ్యర్థి ఎవరోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాలు అభ్యర్థి ఎంపిక కోసం ఇవాళ సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోనని […]
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొనడం తెలిసిందే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు […]
రాష్ట్రపతి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది. ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి […]
రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో కోహ్లీ సేదతీరాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్‌లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. విరాట్ తన ట్విటర్‌లో బీచ్‌లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 […]
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. దాదాపు 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజర్లు అంతా గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీకి అలవాటు పడడంతో.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మార్కెట్ తగ్గింది. ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుందని, భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువని, […]
జూన్ చివరి నాటికి రష్యా 40వేల మందికి పైగా సైనికులను కోల్పోయే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ జెలెన్‌స్కీ అన్నారు. “రష్యన్ సైన్యం డాన్‌బాస్‌లో రిజర్వ్ దళాలను మోహరించడానికి ప్రయత్నిస్తోందని.. అయినా వారు ఏం సాధించారని” ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు. జూన్‌లో రష్యా 40వేలకు పైగా సైనికులను కోల్పోవచ్చని.. వారు అనేక దశాబ్దాలుగా చేసిన ఏ యుద్ధంలోనూ అంతమంది సైనికులను కోల్పోయి ఉండదని జెలెన్‌స్కీ వివరించారు. ఎనిమిదేండ్లుగా రష్యా అనుకూల రెబెల్స్ ఆధీనంలో ఉన్న […]