బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిరోహించిన ఎలిజబెత్.. ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్–2 1952లో సింహాసనమెక్కారు.బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాణి ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు.
అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనందోద్వేగాలకు లోను చేసింది’’ అని పేర్కొన్నారు.
1952, సెప్టెంబర్ 9న తన తండ్రి కింగ్ జార్జి-4 మరణానంతరం క్వీన్ ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటన్ రాణికి ప్రధాని డేవిడ్ కామెరూన్ అభినందనలు తెలిపారు. బ్రిటన్‌కు క్వీన్ ఎలిజిబెత్-2 40వ పాలకురాలు. తన పాలనాకాలంలో ఆమె మొత్తం 12 మంది బ్రిటన్ ప్రధానులను చూశారు.