ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఈ చట్టాల ప్రకారం పౌరులు తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతిదీ సజావుగా జరిగేలా చట్టాలు రూపొందించబడ్డాయి. కానీ, కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఆ చట్టాలేంటో? ఏమిటా కథ చూసేద్దామా!
ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెడతారట. స్నానం చేయకపోతే జైల్లో పెట్టడమేంటి రా బాబు అనుకోకండి. ఎందుకంటే ఆ దేశంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించటమే కాదు చట్టవిరుద్ధంగా భావిస్తారట. మనం చదవడానికి చాలా ఫన్నీగా ఉన్నా అక్కడ మాత్రం ఈ రూల్ ఎవరూ బ్రేక్ చేయరట మరీ..
-అలాగే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మరో వింత చట్టం ఉంది.. అదేంటంటే కార్లను లోదుస్తులతో శుభ్రం చేయడం అక్కడ నిషేధించారంట. ఎవరైనా అలా చేస్తే జరిమానా కూడా విధిస్తారంట.
-స్విట్జర్లాండ్‌లో మరో వింత చట్టం ఉంది. రాత్రి 10 గంటల తర్వాత బాత్రూంలో ఫ్లష్‌ను ఉపయోగించడం నిషేధించబడింది. ఏ ఇంటి నుంచి ఫ్లషింగ్ చేసినా జరిమానాలు విధిస్తారు.
-ఇటలీలో ఒక నియమాన్ని చదివితే మీరు షాక్ అవుతారు. కానీ నిజంగా ఒక నియమం ఉంది. మిలన్ నగరంలో మనుషుల నవ్వును నిషేధించారు. ఇక్కడ ఎవరైనా నవ్వుతూ కనిపిస్తే జరిమానా విధిస్తారు.
-బ్రూనైలో స్వలింగ సంపర్కులు చట్టవిరుద్ధం. దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించబడుతుంది. అయితే ఈ శిక్ష కూడా విచిత్రంగా ఉంది. ఈ శిక్ష ఉరి వేయడం కాదు, రాళ్లతో కొట్టి చంపేస్తారట.
-ఇరాన్‌లో ఇంట్లోని పెంపుడు జంతువులతో సెక్స్ చేయొచ్చట. కానీ, క్రూర మృగాలతో పాల్గొంటే మాత్రం నేరమట. వామ్మో… అంటే అక్కడ జంతువులతో కూడా..!
-మధ్య ఆసియా దేశం బురుండీలో గ్రూప్ జాగింగ్‌ను నిషేదించారు. దీన్ని అతిక్రమించేవారికి జీవిత ఖైదు తప్పదు. అయితే, ఒంటరిగా జాగింగ్ చేసేవారికి మాత్రం మినహాయింపు ఉంది. గ్రూప్ జాగింగ్ విద్రోహ చర్యలకు కారణమవుతుందనేది అక్కడి ప్రభుత్వ వాదన. వామ్మో.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో జాగింగ్ చేసినా నేరమేనన్నమాట!
-స్విట్జర్లాండ్‌లోని ‘కుడ్లే పుడ్లే’ అనే వేడి నీటి కొలను వద్ద గట్టిగా కౌగిలించుకోవచ్చు, ముద్దులాడుకోవచ్చు. కానీ, సెక్స్ మాత్రం చేయకూడదట. దానికి కారణమేమిటో మరి.
ఈ విచిత్రమైన చట్టాలు విన్న తర్వాత, మీరు వింతగా, నవ్వుతూ ఉంటారు. కానీ ఈ దేశాలు నిజంగా అలాంటి వింత చట్టాలను కలిగి ఉన్నాయి. పౌరులు వాటికి కట్టుబడి ఉండాలి. ఈ చట్టాలు, నిబంధనలను పాటించనందుకు జరిమానాలు విధించబడుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన చట్టం ప్రకారం శిక్షార్హమైనది. అయితే ఆయా చట్టాల వల్ల ప్రయోజనం ఏంటో తెలయదు గానీ ఆయా దేశాల ప్రజలు మాత్రం ఈ వింత చట్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.