కరోనా వైరస్ పీడ పోకముందే మరోవైరస్ కలకలం రేపుతోంది. పలుదేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తిపై తాజాగా నిపుణులు పలు పరిశోధనలు చేపట్టారు. అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, కానీ సోకిన వ్యక్తితో నిరంతరం సన్నిహితంగా ఉంటే వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. వైరస్ సోకిన వారితో శారీరక సంబంధం ద్వారా.. వారి దుస్తులు, వారు దుప్పట్లు తాకడం ద్వారా మంకీపాక్స్ […]
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కొవిడ్ నుంచి 4,216 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హర్యానాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో క్రియాశీల కేసులు 40 వేల మార్కును దాటేశాయి. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41 […]
బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత జరిగిన ఈ ప్రదర్శనలు కొన్ని చోట్ల హింసకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో […]
కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా ఖండిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ముజాహిదీన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు శనివారం కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో సాగుతున్న టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల శ్రేణిలో పలువురు ఉగ్రవాదులు, వారి కమాండర్లు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు జరిపాయి. మరోవైపు […]
శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్‌కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్‌సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు. […]
భారత్, చైనాతోనే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ సన్నిహత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలతో రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధం వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుందని… అక్కడ 150 కోట్ల మంది ఉన్నారన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యమని పుతిన్ […]
ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ పీవీ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధు ఇప్పటివరకు […]
ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల […]
నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, రాజస్థాన్‌లలోని నాలుగేసి స్థానాల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో ఆరు, హరియాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు ముగిసినా.. అక్కడ ఓట్ల లెక్కింపు జరగలేదు. బీజేపీ ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. మూడు స్థానాలను […]
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత […]