నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు […]
సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బడా వ్యాపారవేత్తలు, నటుల నుంచి డబ్బు వసూలు చేయడానికే లేఖ పంపినట్లు మహారాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మరణించిన కొద్ది రోజులకే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రికి హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాగింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఓ బెంచీ […]
ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల పాటు శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. […]
కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే […]
దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ యల్దేరింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. […]
జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లో షోపియాన్ జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కంజియులర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు జరగుతున్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని వెల్లడించారు. వారు లష్కరే తొయీబాకు చెందినవారని, వారిలో ఒకరు షోపియాన్‌కు […]
మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచిన కామాంధులు.. సొంతవారినీ వదలడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. ఇలాంటి వారిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా విచక్షణ మరిచి ఉద్యోగం కోసం ముంబయి వచ్చి ఓ వివాహతపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగొట్టారు. ఉద్యోగం వెతుక్కుంటూ ముంబయి వచ్చిన ఓ 19 ఏళ్ల వివాహితపై సామూహిక […]
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 8,822 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,245,517కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,24,792కు చేరింది. మంగళవారం 5,718 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,26,67,088కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి శాతం 98.66గా ఉంది. మృతుల శాతం 1.21 శాతంగా ఉంది. […]
హైదరాబాద్‌లోని బేగంపేటలో మందుబాబులు హల్‌చల్ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురిని పోలీసులు ఆపారు. అప్పటికే మందుకొట్టి ఉన్న ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాన్ని ఆపిన పోలీసులతో ఆ వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. మమ్మల్నే ఆపుతారా.. అంటూ మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ ఎస్సైపై దాడిచేశారు. ఈ […]
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్‌డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత […]