ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని […]
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్ వేరియంట్ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే […]
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్‌డొనాల్డ్స్‌ను పునఃప్రారంభించారు. దిగ్గజ ఫాస్ట్‌పుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది. […]
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్‌ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్‌ను […]
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో రెండో రోజు కూడా అల్లర్లు జరిగాయి. హౌరా […]
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై వీడియో తీసిన కశ్మీర్ యూట్యూబర్ ఫైసల్ వాని క్షమాపణలు చెప్పారు. నుపుర్‌ను నరికినట్లు తన వీడియోలో ఫైసల్ చూపించాడు. దాన్ని ఆన్‌లైన్‌లో అతను పోస్టు చేశాడు. మతపరమైన ఆరోపణలు చేసేవాళ్ల తల నరకడమే శిక్ష అని తన వీడియోలో యూట్యూబర్ ఫైసల్ పేర్కొన్నారు. గొడ్డలితో నుపుర్ తలను నరికినట్లు ఆ వీడియోలో గ్రాఫిక్స్ ప్రజెంట్ చేశాడు. నుపుర్ తలను విసిరేసినట్లుగా చూపించాడు. అయితే […]
టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. గతంలో కొలంబో పాలకులు భారత్‌ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. భారత్ గతంలో వంద కోట్ల డాలర్ల […]
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్‌ఇండియాలో ఎంపికైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారాడు. ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఉమ్రాన్ మాలిక్‌కు మొదటి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ […]
స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను కొలంబియా అధికారులు గుర్తించారు. 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. 1708లో బ్రిటీష్ దాడిలో శాన్‌జోస్ యుద్ధ నౌక మునిగిపోయింది. అయితే ఆ నాటి తెరచాప నౌక శిథిలాలను గుర్తించారు. ఆ నౌకల్లో తరలించిన సుమారు 1.32 లక్షల కోట్ల (17 బిలియన్ల డాలర్ల) విలువైన బంగారు […]