Poco: పోకో నుంచి త్వరలో పవర్‌ఫుల్ 5జీ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోకో కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ప్రకటించింది. ఎఫ్ సిరీస్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే పోకో తీసుకురానున్నట్టు పోకో ఎఫ్4 5జీ అని స్పష్టమైంది. గ్లోబల్‌తో పాటు ఇండియాలోనూ ఒకేసారి ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది పోకో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోకో ఎఫ్4 5జీని అధికారికంగా ప్రకటించింది. ఈ ట్వీట్‌లో ‘ఎవ్రీథింగ్ యూ నీడ్’ అని పేర్కొంది. స్మార్ట్ ఫోన్ పేరు గురించి తప్ప స్పెసిఫికేషన్ల గురించి కానీ, ధర గురించి కానీ పోకో ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతోపాటు ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు ట్వీట్ చేసింది.
పోకో ఎఫ్4 మొబైల్‌ను ఆల్‌రౌండర్‌గా తీసుకురావాలని పోకో భావిస్తోంది. ఎఫ్4 జీటీని గేమింగ్ కోసం ప్రధానంగా తీసుకురాగా.. ఎఫ్4ను మాత్రం అన్ని విభాగాల్లో సమతూకంతో లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికైతే పోకో ఎఫ్4 విడుదల తేదీని పోకో కచ్చితంగా చెప్పలేదు. అయితే త్వరలో భారత మార్కెట్‌లో ఈ ఫోన్ అడుగుపెట్టనుంది. ఇటీవల చైనాలో విడుదలైన రెడ్‌మీ కే40ఎస్ రీబ్రాండెడ్ వేరియంట్‌గా పోకో ఎఫ్4 వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు, అంచనా ధర ఎంత ఉండొచ్చో చూడండి.
Also Read
- Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే!
- Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
- TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
రెడ్‌మీ కే40ఎస్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయితే.. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఈ మొబైల్‌లో ఉండొచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుందని సమాచారం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పోకో 20 మెగాపిక్సెల్ కెెమెరాను ఇచ్చే అవకాశం ఉంది. పోకో ఎఫ్4 5జీ ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. అంటే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌కే ఉంటుంది.
చైనాలో రెడ్‌మీ కే40ఎస్ ప్రారంభ ధర 1899 యువాన్లు అంటే సుమారు రూ.22,068గా ఉంది. దీని ప్రకారం చూస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉండే పోకో ఎఫ్4 5జీ ధర భారత్‌లో రూ.23వేల నుంచి రూ.25వేల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!