Niranjan Reddy: కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ. 6,122 కోట్లు రైతులకు ప్రీమియం కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది.. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు, రైతుబంధు, రైతు బీమా రావడం లేదు అని ఆరోపించారు.
BJP MP Laxman: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ, గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు.. ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారు అని పేర్కొన్నారు.
ATM Robbery Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది.
Mamunur Airport: వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పాటు నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో […]
Fire Accident: హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్లో గల ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ చౌరస్తా దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో ఈరోజు ( మార్చ్ 4) ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి.
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
AP EX CID Chief Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ (Former CID Chief of AP) పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: భారతదేశ ఉత్పత్తులు వరల్డ్ వైడ్ గా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అనే తన ప్రచారం ఫలితం ఇస్తోందని చెప్పుకొచ్చారు. పలు ఆవిష్కరణలకు మనదేశం వేదిక అవుతోందని పేర్కొన్నారు.