ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నియోజక వర్గ ఇంఛార్జుల పని తీరు ఏం బాగోలేదని వెల్లడించింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని తెలిపింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు మూడో గ్రూప్ గా విభజించిన నటరాజన్.
మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ ఎవరు దాటిన వారి పైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా, చిన్నారెడ్డి కైనా, రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరు అని మధుయాష్కీ పేర్కొన్నారు.
Lady Aghori: గుంటూరులో అనిల్ బెహరా అనే వ్యక్తితో మహిళ అఘోరికి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వచ్చిన లేడీ అగోరిని అదుపులోకి తీసుకొని వివాదాలు వద్దంటూ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు.
చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు.
పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు.. పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు.. నా పని తీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చు.. కానీ, బయట మాట్లాడకండి: మీనాక్షి నటరాజన్
Jana Reddy: కులగణన అంశంలో నా పాత్ర లేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదు అని పేర్కొన్నారు. యెస్తు క్రీస్తు.. చెప్పిన గుణాలు కలిగిన వాడ్ని నేను.. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది..
SBI Bank: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 2024 నవంబర్ 19వ తేదీన బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులు నిరసన చేస్తున్నారు.
Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 77,203 ఓట్లు లెక్కించాల్సి ఉంది.
CPI Party: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది.