AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదేళ్ళుగా పీలేరులో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అసెంబ్లీలో పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తడంతో.. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే, గతంలో పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా విచారణ కమిటీ వేయడంతో పీలేరులో అక్రమాలకు పాల్పడిన నాయకులు, రియల్టర్లు, అధికారులలో గుబులు నెలకొంది.