గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్మిత్ తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, 170 వన్డేల్లో 5,800 పరుగులు చేసిన స్మిత్.. 12 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ అత్యధిక స్కోర్ 164 పరుగులు.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
Yogi Adityanath: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భారతదేశ మతపరమైన భావాలతో "ఆటలు" పడుతోందన్నారు.
Ragging Cases: కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కేఎల్ఎస్ఎ) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
Supreme Court: అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. స్టేట్ గవర్నమెంట్స్ వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారింది.. ప్రైవేట్ హస్పటల్స్ అన్నీ రోగులు, వారి బంధువుల నుంచి బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై తాజాగా సుప్రీంలో విచారణ జరిపింది.
మొఘల్స్ ఆఖరి చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాలను నిర్మించాడని, క్రూరమైనవాడు కాదని మహారాష్ట్రలోని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అబూ అజ్మీ ప్రశంసించారు. దీంతో ఆ కామెంట్స్ వివాదానికి దారితీసింది. ఇక, ఎస్పీ చీఫ్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తీవ్ర విమర్శలు గుప్పించారు.
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్ను కోల్పోయింది.
Meenakshi Natarajan: ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యల పైన ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది.