ATM Robbery Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది. మంటలను చూసి అక్కడ నుంచి పరారైన దుండగులు.. మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని SBI ఏటిఎంలో చోరీ చేసిన దుండగులే ఈ చోరీకి యత్నయించినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేవ్పల్లి కంటే 30 నిమిషాల ముందు రావిర్యాలలో ఏటీఎంని గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి సుమారు 30 లక్షల రూపాయల వరకు ఎత్తుకెళ్లారు దుండగులు.
Read Also: Ayodhya Terror Attack: అయోధ్యపై దాడికి ప్లాన్.. ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
అయితే, కార్ లో పరార్ అవుతూ మార్గమద్యంలో SBI ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు దుండగులు. కాగా, హర్యానా రాష్ట్రానికి చెందిన మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.