PM Modi: భారతదేశ ఉత్పత్తులు వరల్డ్ వైడ్ గా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అనే తన ప్రచారం ఫలితం ఇస్తోందని చెప్పుకొచ్చారు. పలు ఆవిష్కరణలకు మనదేశం వేదిక అవుతోందని పేర్కొన్నారు. ఇక, చౌకైన పరిష్కారాలను కనుగొంటూ వాటిని ప్రపంచానికి అందిస్తోంది.. ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారత్‌ను ఓ ఉపశాఖగా చూశాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా పోయిందన్నారు. మనం ఇకపై శ్రామిక శక్తిగా కాకుండా ప్రపంచ శక్తిగా మారుతున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka: దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు..
అయితే, సెమీ కండక్టర్లు, విమాన వాహక నౌకలను తయారు చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో లభించే సూపర్ ఫుడ్ లైన మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులకు ప్రతీకగా నిలుస్తుండగా.. మనం పాటించే యోగా, ధ్యానం లాంటి వాటిని విదేశీయులు కూడా ఆచరిస్తున్నారు.. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలనే తన ప్రయత్నాన్ని, దేశం సాధించిన విజయాలను కొత్త ఛానల్ ‘న్యూస్ ఎక్స్ వరల్డ్ విదేశాలకు తెలియజేస్తుందని నేను ఆశిస్తున్నాను అని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు.