MLC Election Results: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు.
Fake Darshan Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లను అధిక రేట్లకు భక్తులకు అమ్మిన వారిపై దేవస్థానం సీఎస్ఓ మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేశారు.
Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు.
AP Teachers Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నాలుగు కేటగిరి లుగా ఉపాధ్యాయుల విభజన చేశారు.
Bolivia Bus Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Local Devotees: ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ రోజు ( మార్చి 02వ తేది) స్థానిక దర్శన కోటా టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది.
రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడంపై పలువురు పలు రకాలుగా చెప్పారు.. మా అమ్మకి ఫోన్ చేసి అభిప్రాయం అడిగా.. నీ మనసులో ఏముందో అదే మనస్పూర్తిగా ఆచరించు అని చెప్పిందని పేర్కొన్నారు. నా తల్లి కోరిక మేరకు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నాను అని మంత్రి లోకేష్ చెప్పారు.