Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు.
జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు.. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారు.. పదవులు కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి మనోహర్ సూచించారు.
జవాడ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఓ వాహనదారుడు ట్రాఫిక్ సీఐ రామారావుతో వితండ వాదానికి దిగాడు. పోలీసులు తమ ఐడీ చూపించాలంటూ అతడు హల్చల్ చేశాడు.. నకిలీ పోలీసులు తిరుగుతున్నారంటూ నానా హంగామా సృష్టించాడు. దీంతో చివరకు తన ఐడీ కార్డు చూపించిన సీఐ రామారావు సదరు వాహనదారుడికి హెల్మెట్ లేకపోవడంతో ఫైన్ వేశాడు.
Margani Bharat: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు మ్యాటర్ ఎక్కువ.. మీటర్ తక్కువ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఎందుకు రూపొందించలేకపోయారు అని ప్రశ్నించారు.
Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Home Minister Anitha: అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది.
Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
Posani: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. మార్చ్ 3వ తేదీ బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఆయా స్టేషన్లకు చెందిన పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
Minister Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదంగా ఉంది అన్నారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు.