AP EX CID Chief Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ (Former CID Chief of AP) పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఏపీ ప్రభుత్వం (AP Govt) ఈ చర్యలు తీసుకుంది. కాగా, సునీల్ కుమార్ పై చర్యలకు ముందు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నేతృత్వంలో విచారణ జరిపింది.. ఎంక్వైరీలో పర్మిషన్ లేకుండానే విదేశాలకు వెళ్లారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: EMPURAAN : హై ఓల్డేజ్ మూవీగా ఎంపురన్
అయితే, పీవీ సునీల్ కుమార్ జార్జియాకు అనుమతి తీసుకుని యూఏఈకి వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. 2023లో ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వీడన్ సైతం వెళ్లొచ్చారని చెప్పుకొచ్చింది. అలాగే, అనుమతి లేకుండానే మరోసారి యూఏఈకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ సస్పెన్షన్ వేటుపై సునీల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ అయిన సంజయ్ ను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.