దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్‌పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్…
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి…
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను…
క్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రాంతాలు రష్యాలో శుక్రవారం విలీనం అవుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం ప్రకటించారు.
ఉక్రెయిన్ పై భీకరదాడిని కొనసాగిస్తోంది రష్యా. యుద్ధం ప్రారంభం అయి నాలుగు నెలలు గడిచినా.. రష్యా తన దాడిని ఆపడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలు మసిదిబ్బను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా దాడులను ఎక్కువ చేసింది. క్రమంగా ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతోంది. తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 21 మంది మరణించారు. బ్లాక్ సీ ఒడెస్సా పోర్టుకు దక్షిణంగా 80…
ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది రష్యా. ఫిబ్రవరిలో ప్రారంభమై యుద్ధం ఐదు నెలలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ముఖ్యంగా డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పట్టు సాధిస్తోంది. అక్కడి నగరాలను నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గత మూడు వారాలుగా కీవ్ పై ఎలాంటి దాడి…