Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బఖ్ ముత్ పట్టణంపై ఆధిపత్యం కోసం రష్యా తీవ్రదాడులు చేస్తోంది. ఒకవేళ ఈ పట్టణం రష్యా వశం అయితే ఇక ఉక్రెయిన్ కు లొంగిపోవడమే దిక్కు. రష్యన్ బలగాలు సునాయసంగా తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం కనబడిచే అవకాశం ఉంది. దీంతోనే బక్ ముఖ్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు పోరుగుతున్నాయి.
Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Russia-Ukraine War: ఏడాది గడిచినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం శీతాకాలం ముగియడంతో ఉక్రెయిన్ పై రష్యా మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా చరిత్రలో మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ పై మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రానున్న మూడు నెలల పాటు ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు తన ఆంతరింగికులతోనే చంపబడతాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. న్యూస్‌వీక్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఈ వ్యాఖ్యలు జెలెన్‌స్కీ ఉన్న 'ఇయర్' అనే ఉక్రేనియన్ డాక్యుమెంటరీలో భాగంగా బయటకు వచ్చాయి.
Russia-Ukraine War: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఈ నెలలో ఏడాదికి చేరింది. ఏడాది కాలంగా ఇరు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపోరొజ్జియా, లూహాన్స్క్, డోనాట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలు, ఇతర నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాతో పోరాడుతోంది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను…
Ukraine War: ఉక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శనివారం క్షిపణులతో దాడి చేసింది. రష్యాతో జరుగుతన్న యుద్ధంతో ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులను అందచేస్తామని బ్రిటన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణల శిథిలాలు తమ భూభాగంలో పడ్డాయని మల్డోవా దేశం ఆరోపించింది. తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డ్నిప్రోలో పై క్షిపణులతో దాడి చేసింది.
There Will Be No Third World War Says zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. స్వేచ్ఛా ప్రపంచం సహాయంతో రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు.