FIFA Rejects Ukrainian President Zelensky’s Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ భావించాడు. ఫిఫా వరల్డ్ కప్ వేదికగా ఎక్కువ ప్రయోజనం పొందాలని రష్యా దురాక్రమణను ఎండగట్టాలని జెలన్ స్కీ భావిస్తున్నాడు. అయితే ఫిఫా నిర్వాహకులు, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. రేపు జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచును ప్రపంచంలో కొన్ని కోట్ల మంది వీక్షిస్తారు. దీని ద్వారా రష్యా, ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు జెలన్ స్కీ భావిస్తున్నారు. అయితే ఫిఫా మాత్రం రాజకీయ సందేశాలకు దూరంగా ఉండాలనే నియమాలను కలిగి ఉంది.
Read Also: Yogi Adityanath: రాహుల్ గాంధీ నీ వ్యాఖ్యలకు సిగ్గుపడు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై యుద్దం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దాదాపుగా సర్వనాశనం అయింది. అక్కడి ప్రజలు బిక్కబిక్కుమంటూ బతుకుతున్నారు. పాశ్చాత్య దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక వ్యూహాలతో ఉక్రెయిన్ బలమైన రష్యాను అడ్దుకుంటూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది. ఇప్పటికే రష్యా దాడుల్లో రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటిస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం చర్యలు జరిపేది లేదంటోంది.
తాజాగా శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. 70 కన్నా ఎక్కువ క్షిపణులను రష్యా ప్రయోగించింది. కీవ్ తో పాటు పలు నగరాలు దెబ్బతిన్నాయి. కీవ్ లో విద్యుత్ వ్యవస్థలు, నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చలికాలాన్ని టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే శనివారం రాజధాని కీవ్ లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించింది ఉక్రెయిన్.