Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి కోసం సిద్ధంగా ఉండాలని ప్రతిపాదించారు.
సెయింట్ పీటర్స్ స్వ్కేర్ లో ఆదివారం మధ్యాహ్నం ఏంజెలస్ ప్రార్థనలకు ముందుగా పోప్ ప్రాన్సిస్ ప్రసంగంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇరు దేశాలు కూడా తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలను విరుద్ధంగా ఇటీవల పరిస్థితులు తలెత్తాయని.. దీన్ని నేను ఖండిస్తున్నానని పోప్ అన్నారు. మానవత్వానికి భయంకరమై, ఊహించలేని గాయంగా ఈ యుద్ధాన్ని అభివర్ణించారు. రక్తపాతాన్ని, ప్రజల కన్నీటిని చూసి బాధపడ్డానని.. వేలాది మంది బాధితులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Adipurush Teaser Launch Live: ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లైవ్
యుద్ధం దేనికి పరిష్కారం కాదని.. విధ్వంసం మాత్రమే అని గ్రహించాలని హితవు పలికారు. బుచా, ఇర్ఫిన్, మరియోపోల్, ఇజియం, జపొరిజ్జియా వంటి ఉక్రెయిన్ ప్రాంతాలు విధ్వంసం అయ్యాయని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు. ఆయుధాలకు స్వస్తి పలికి న్యాయమైన, స్థిరమైన పరిష్కారానికి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని పోప్ కోరారు. యుద్ధం అంతం చేయడానికి, చర్చలకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యువ తరాలు శాంతి అనే పవిత్రమైన గాలిని పీల్చుకోండని.. యుద్ధంతో కలుషితమైన గాలిని పీల్చుకోవద్దని.. ఈ భయంకరమైన విషాదాన్ని అంతం చేయడానికి అన్ని దౌత్యమార్గాలను ఉపయోగించుకోవాలని.. యుద్ధం ఒక లోపం, భయానకమైనదని పోప్ అన్నారు.