గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఓ వైపు అమెరికా కూడా శాంతి ఒప్పందం దగ్గరలోనే ఉందని చెబుతుండగా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు.
ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ పట్టుసాధిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. కా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం సాగింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం సమావేశం అవుతున్నట్లు మాస్కో డిప్యూటీ ఐక్యరాజ్యసమితి రాయబారి డిమిత్రి పాలియాన్‌స్కీ తెలిపారు.
Yulia Svyrydenko: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్‌కో (Yulia Svyrydenko)ను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా గురువారం (జులై 17)న నియమించారు. 2022లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ నియామకం ఉక్రెయిన్ ప్రభుత్వంలోని కీలక మార్పులలో ఓ భాగం. యుద్ధంతో అలసిపోయిన దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు,…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.