ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. Read Also: Summer Holidays: ఏపీ…
ఉక్రెయిన్ తో యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా దీనిని పేర్కొంటున్నారు. ఎలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఇది ఛేదించగలదు. క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అని ప్రెసిడెంట పుతిన్ స్వయంగాప్రకటించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ డెడ్లీ మిసైల్ పేరు సర్మత్. రష్యా అమ్ములపొదిలో వున్న కింజల్, అవాంగార్డ్ క్షిపణుల సరసన త్వరలో సర్మత్ చేరనుంది. అప్పుడు రష్యా వైపు చూడాలంటే శత్రువులు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు,…
ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం సైతం ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిథిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో శ్మశాన వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు నిర్వహిస్తున్న రష్యా..…
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ లోని నగరాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధం ఇవాళ్టికి 17వ రోజుకు చేరుకుంది. రష్యా మాత్రం తన పట్టువీడడం లేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుదాడులతో పలు నగరాలకు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వలస పోతున్నారు. 10 లక్షలమంది వరకూ వలస వెళ్ళి వుంటారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లినట్టు…
ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం…
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే రెండుసార్లు యుద్ధం ఆపాలని రష్యాతో ఉక్రెయిన్ చర్చలకు దిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రష్యాతో చర్చలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది… రష్యా దాడులు తీవ్రతరం చేసినా.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది.. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.. ఇక, రష్యా ఓవైపు దాడులు చేస్తున్నా.. మరోవైపు, దేశాన్ని వీడేది లేదు.. ఇక్కడే ఉంటాం.. దేశాన్ని కాపాడుకుంటాం.. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అయితే, జెలెన్‌స్కీపై రష్యా మీడియా తాజాగా ప్రసారం…
యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల…
రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. మరోవైపు.. ఇప్పటికే తాము ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా.. రష్యాతో చర్చలకు అంగీకారం తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కాగా, బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించింది. చర్చల కోసం బెలారస్కు ఉక్రెయిన్ బృందం బయలుదేరింది.…