రష్యాను నిలువరిస్తామని, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొదటి నుంచి చెబుతూ వస్తున్నది. ఉక్రెయిన్ కోసం నాటో దళాలను సరిహద్దులకు తరలించి చాలా రోజులైంది. కానీ ఆ దళాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కాలేదు. అమెరికా సైతం తమ బలగాలను పోలెండ్‌కు తరలించింది. అయితే, రష్యాతో నేరుగా యుద్ధం చేయబోమని, ఉక్రెయిన్‌కు అవసరమైన సహకారం మాత్రమే చేస్తామని చెబుతూ వచ్చింది. నాటో, అమెరికా దేశాలు అండగా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగపాటే మిగిలింది. యుద్ధం వచ్చే…
రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. అయితే, రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా తమపై…