అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం సమావేశం అవుతున్నట్లు రష్యా రాయబారి డిమిత్రి పాలియాన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం చర్చలు జరగవని పేర్కొన్నారు. పుతిన్-జెలెన్‌స్కీ మధ్య చర్చలు ఉండొచ్చని ప్రచారం జరుగుతుందన్న వార్తలపై స్పందిస్తూ.. అవి ఊహాగానాలు మాత్రమే అన్నారు. వారిద్దరి సమావేశం గురించి తనకు తెలియదని.. అయినా కూడా తోసిపుచ్చలేమని చెప్పారు. సమావేశం జరిగే స్థలాన్ని మాత్రం దౌత్యవేత్త బహిర్గతం చేయలేదు.
ఇది కూడా చదవండి: Boycott G Pay- Phone Pay: ట్రెండింగ్లో “బాయ్‌కాట్ గూగుల్ పే, ఫోన్ పే”.. ఎందుకో తెలుసా..?
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. అయినా ప్రయోజనం లభించలేదు. అంతమాత్రమే కాకుండా ట్రంప్ స్వయంగా పుతిన్‌కు ఫోన్ చేసి కాల్పుల విరమణకు అంగీకరించాలని కోరారు. అందుకు పుతిన్ ససేమిరా అన్నారు. ఇక చేసేదేమీలేక ట్రంపే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వచ్చే వారం ట్రంప్-పుతిన్ భేటీకానున్నారు. ఈ సమావేశం తర్వాతైనా కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారేమో చూడాలి.
ఇది కూడా చదవండి: Heavy Rains: వదల బొమ్మాలి.. వదల.. తెలంగాణను వదలనంటున్న వరణుడు.. మరో రెండు రోజులు?
2022 నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవంతులు నేలకూలాయి. ఇరు దేశాల మధ్య భారీ నష్టం జరిగింది. వాటి తర్వాత జరిగిన యుద్ధాలన్నీ ఆగిపోయాయి గానీ.. ఈ యుద్ధం మాత్రం ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు.