Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా దాడుల వల్ల కలిగిన విధ్వంసాన్ని చూడాలని కోరారు. ‘‘దయచేసి, ఏ విధమైన నిర్ణయాలు, ఏ రకమైన చర్చలు జరపడానికి ముందు, ఉక్రెయిన్‌లో ప్రజలు, ఆస్పత్రులు, చర్చిలు, పిల్లలు ఎలా నాశనం చేయబడ్డారో, చనిపోయారో చూడటానికి రండి’’ అని ఆదివారం జెలెన్స్కీ, ట్రంప్‌ని కోరారు.
Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది…
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సంభాషించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది.
Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రజామోదం రేటింగ్ అమాంతం పెరిగింది. శుక్రవారం ప్రచురించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన అప్రూవల్ రేటింగ్ మరో 10 శాతం పెరిగినట్లు తేలింది.
వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది.
Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యాకు సంబంధించిన భూభాగాలు అప్పగించాలంటూ ట్రంప్ సూచించారు.
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.