అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ సర్వత్రా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈనెల 15న అలాస్కాలో ఇద్దరూ సమావేశం అవుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సాధ్యం కాలేకపోయింది. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ ప్రయోజనం దక్కలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఎలాగైనా రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలని మొండిపట్టుపట్టారు. దీంతో ఆగస్టు 15న ఇద్దరు నేతలు సమావేశం అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోడీ.. కాసేపు నవ్వుకున్న నేతలు
వీరిద్దరి భేటీ ఒకెత్తు అయితే.. ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హాజరవుతారా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సమావేశానికి జెలెన్‌స్కీని కూడా ఆహ్వానించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే టేబుల్‌పై త్రైపాక్షిక చర్చలు జరపాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. పుతిన్-జెలెన్‌స్కీని ఎదురెదురుగా కూర్చోబెట్టి శాంతి ఒప్పందానికి ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రణాళిక రచిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు వైట్ హౌస్ కూడా ఆదివారం ప్రకటించింది. ముగ్గురి మధ్య శాంతి చర్చలు జరగనున్నట్లు వైట్‌హౌస్ తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే..
అయితే ప్రస్తుతం.. పుతిన్‌తో మాత్రమే ద్వైపాక్షిక సమావేశాన్ని ప్లాన్ చేస్తోందని వైట్ హౌస్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడినట్లుగా రాయిటర్స్ నివేదించింది. అయితే జెలెన్‌స్కీ కూడా ఉంటే బాగుంటుందని.. ఇందుకోసం వైట్‌హౌస్ పరిశీలిస్తున్నట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. అయితే శాంతి చర్చల్లో భూభాగం మార్పిడి ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. ఇంకోవైపు యూరోపియన్ దేశాలు మాత్రం.. జెలెన్‌స్కీ ఉండాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఏం జరుగుతుందో అంతా సస్పెన్ష్‌గా ఉంది.
శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే రష్యాపై 100 శాతం సుంకం విధిస్తామని గతంలో ట్రంప్ బెదిరించారు. అంతమాత్రమే కాకుండా రష్యాతో సంబంధాలు పెట్టుకునే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని బెదిరించారు. అందులో భాగంగానే భారత్‌పై 50 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. శాంతి చర్చలు ఫలిస్తే.. భారత్‌పై సుంకాలు తగ్గిస్తారా? కొనసాగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: పాక్తో చెస్ ఆటలా సాగిన ఆపరేషన్ సిందూర్.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు