Zelenskiy: రష్యాతో శాంతి ఒప్పందానికి అమెరికా ఒత్తిడి.. జెలెన్‌స్కీ కొత్త ప్లాన్ ఇదే!
- రష్యాతో శాంతి ఒప్పందానికి అమెరికా ఒత్తిడి
- భూభాగాలు వదులుకునేందుకు ఇష్టపడని ఉక్రెయిన్
- తాజాగా కొత్త ప్లాన్ వేసిన జెలెన్‌స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. రష్యా రూపొందించిన ప్రణాళికను అంగీకరించబోమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో డాన్‌బాస్‌ను వదులుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తాజాగా 20 పాయింట్ల శాంతి ప్రణాళికను బుధవారం అమెరికాకు అందించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు.. మెనూ ప్రత్యేకతలు ఇవే!
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
అయితే తాజాగా శాంతి ఒప్పందానికి అంగీకారం తెల్పాలంటూ ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. క్రిస్మస్‌లోపు శాంతి ఒప్పందం జరగాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చే రిజల్ట్స్‌ను బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Alluri District: ఏపీలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 15 మంది మృతి!
అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు ఏ మాత్రం ఉక్రెయిన్‌కు ఇష్టం లేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నడుస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినా ఉక్రెయిన్ భూభాగాలు స్వాధీనం చేసుకోవడంలో విఫలమైంది. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను కలిగిన తూర్పు డాన్‌బాస్‌ను రష్యా స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది. ఉక్రెయిన్ దళాలు వదిలిపోవాలని రష్యా పట్టుబట్టింది. కానీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం డాన్‌బాస్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తు్న్నామని.. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని జెలెన్‌స్కీ కోరారు.
ఇదిలా ఉంటే యుద్ధం సాకుగా చూపించి జెలెన్‌స్కీ ఎన్నికలు నిర్వహించడం లేదని ట్రంప్ చేసిన ఆరోపణలపై కూడా స్పందించారు. తమ భద్రతకు మిత్ర దేశాలు హామీ ఇస్తే.. 90 రోజులలోపే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని జెలెన్‌స్కీ అన్నారు. రష్యా దాడులు చేస్తుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సైనికులు ఎలా ఓటు వేస్తారు? ప్రజలు ఎలా ఎన్నికల్లో పాల్గొంటారని అడిగారు.
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!