ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఓ వైపు అమెరికా కూడా శాంతి ఒప్పందం దగ్గరలోనే ఉందని చెబుతుండగా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. దీంతో శాంతి ఒప్పందంపై ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
ఇది కూడా చదవండి: India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
ఇటీవల ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం కోసం 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ రూపొందించారు. ఇందుకోసం ఇరు దేశాలను ఒప్పించేందుకు అమెరికా అధికారుల ప్రతినిధి బృందం కూడా రంగంలోకి దిగి చర్చలు జరిపింది. అయితే చర్చలు కొలిక్కి వచ్చినట్లే చెబుతున్నా.. కీలక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా సానుకూలంగానే ఉంది.. కానీ ఉక్రెయిన్, యూరోపియన్ దేశాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Highcourt Telangana : నెక్కొండకు కొత్త హోదా.? హైకోర్టు సంచలన ఆదేశాలు.!
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. ‘‘ఏం జరుగుతుందో చూద్దాం. ఒక తేదీని నిర్ణయించారు. తేదీ చాలా సమీప భవిష్యత్‌లో ఉంటుంది. నాకు గడువు లేదు. అందరూ పోరాటంలో అలసిపోయారని భావిస్తున్నా. ఇప్పటికే చాలా మందిని కోల్పోయారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాకు రావాలనుకుంటున్నారు. కానీ ముందుగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను భావిస్తున్నా. మేము మంచి చర్చలు జరుపుతున్నాం. పురోగతి సాధించబోతున్నాం. ఇప్పటికే 8 యుద్ధాలను పరిష్కరించాం. పుతిన్‌తో సంబంధం కారణంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపడం సులభం అనుకున్నా. కానీ కష్టంగా మారింది. ఇప్పటికే సమయం మించిపోయింది. వెంటనే రెండు దేశాలు ఒప్పందం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి నేతలను కలుస్తా.’’ అంటూ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.
శాంతి ఒప్పందం చేసుకున్నాకే పుతిన్, జెలెన్‌స్కీని కలుస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. పుతిన్‌తో చర్చల కోసం మాస్కోకు వెళ్లాలని ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌ను ఆదేశించారు. అలాగే అబుదాబిలో రష్యా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్‌కు ఉక్రెయిన్ అధికారులను కలిసే బాధ్యతను అప్పగించారు.
#WATCH | On Ukrainian President Volodymyr Zelenskyy's possible visit, during a Press Gaggle on Air Force One, US President Donald Trump says, "…He would like to come, but I think we should get a deal done first. We’re having good talks…We won’t know for a little while, but… pic.twitter.com/SRlXf1bpBG
— ANI (@ANI) November 26, 2025
#WATCH | On 'Thanksgiving Deadline' for Ukraine-Russia Peace Plan, during a Press Gaggle on Air Force One, US President Donald Trump says, "We’ll see what happens. They set up a date. The date is going to be sometime in the very near future…I don’t have a deadline. The only… pic.twitter.com/qEvdA54WkK
— ANI (@ANI) November 26, 2025