అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం సాగింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలు అప్రమత్తం అయ్యాయి. జెలెన్‌స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణనే ఎందుకు? బీజేపీ వ్యూహమిదేనా?
ఇదిలా ఉంటే జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్ ఝలక్ ఇచ్చారు. పుతిన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలకు జెలెన్‌స్కీ అంగీకరించాల్సిందేనని సంకేతం ఇచ్చారు. ఉక్రెయిన్ నాటోలో చేరబోదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్ భూమిని వదులుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాగైతేనే యుద్ధానికి ముగింపు లభిస్తుందని సంకేతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్-పుతిన్ సమావేశం మరోసారి హాట్‌హాట్‌గా సాగే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యూరోపియన్ నేతలు కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ఉక్రెయిన్ భూమిని వదులుకునేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ
ఇక డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్ ప్రాంతాలను తిరిగి ఇవ్వాలని పుతిన్ కోరినట్లుగా జెలెన్‌స్కీకి ముందుగానే ట్రంప్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదని సమాచారం. అయితే సోమవారం జరిగే ముఖాముఖిలో జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే సోమవారం జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశం ముగిశాక.. ఈనెల 22న త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పుతిన్-ట్రంప్-జెలెన్‌స్కీ ముగ్గురు కూర్చుని సమస్య పరిష్కారానికి చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇక తాజాగా ట్రంప్‌తో జెలెన్‌స్కీ చర్చలు సానుకూలంగా ఉంటాయా? లేదంటే వ్యతిరేకంగా ఉంటాయా? చూడాల్సి ఉంది.
ఆగస్టు 15న అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ అయ్యారు. యుద్ధంపై ఒక క్లారిటీకి రాలేదు. అసంపూర్తిగానే సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఇద్దరి మధ్య సమావేేశం జరిగింది. చివరికి ఎలాంటి ప్రయోజనం లభించకుండానే ముగిసింది. మరోసారి మాస్కో వేదికగా భేేటీకావాలని నిర్ణయం తీసుకున్నారు.
