Ram Mandir : రాముడి జీవితం అయోధ్యలోని రామ మందిరంలో పవిత్రమైంది. ఆ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అయోధ్యలో ప్రతి సెకనుకు రూ.1.26 లక్షలు భక్తులు ఖర్చు చేస్తారని దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్ బీఐ అంచనా వేసింది.
Ayodhya Ram Mandir : ఈరోజు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక అతిథులు వచ్చారు.
KCR: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం భారతీయుల కలను సాకారం చేయనుంది.
Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.
Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు ఫేస్బుక్లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
Man plugs kettle in train: కదులుతున్న ట్రైన్లో ప్రయాణికుడు తెలియక చేసిన తప్పిదం అతను అరెస్ట్ అయ్యేందుకు కారణమైంది. రైలులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే సాకెట్ని నీటిని వేడిచేసుకునేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ కోసం వాడాడు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్వాల్ అనే వృద్ధుడు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు.