Aphrodisiac Pills: కొత్తగా పెళ్లిన మహిళపై భర్త రాక్షసుడిగా ప్రవర్తించాడు. శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు వేసుకుని ఫస్ట్ నైట్ రోజు సెక్స్ చేశాడు. దీంతో నవవధువు తీవ్ర గాయాలతో మరణించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీద్‌పూర్‌లో చోటు చేసుకుంది. మొదటి రాత్రి రోజు సెక్స్ స్టామినాను పెంచే మాత్రలను తీసుకుని, సెక్స్ చేయడంతో మహిళ మరణించింది. తీవ్రగాయాలైన మహిళను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
బాధిత మహిళను బుధవారం( ఫిబ్రవరి 7)న ఆస్పత్రిలో చేర్చారు. శనివారం (ఫిబ్రవరి10)న మరణించినట్లు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి భర్త, అతని కుటుంబం ఇంటికి తాళాలు వేసుకుని ఊరు వదిలి పారిపోయినట్లు సమాచారం.
సదరు మహిళకు ఫిబ్రవరి 3న ఉరైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మహిళ తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సోదరుడు ఆమె పెళ్లిని ఘనంగా చేశారు. వివాహం తర్వాత శనివారం నవవధువు అత్తామామల ఇంటికి వెళ్లింది. శోభనం రోజు బాధితురాలి భర్త సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పిల్స్ వేసుకుని, ఆమెతో శృంగారం చేశాడు. ఏడు రోజుల తర్వాత కాన్పూర్‌లో జరిగే ఓ వివాహానికి హాజరైన క్రమంలో మహిళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వెంటనే ఆమెను గైనాకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇలాంటి గాయాలను గ్యాంగ్ రేప్ కేసుల్లోనే చూస్తామని, ఆమె భర్త అంతలా ఆమెపై దారుణానికి ఒడిగట్టాడని డాక్టర్ వెల్లడించారు. మాత్రలు తీసుకని ఆమెతో వైల్డ్ సెక్స్ చేసినట్లు భర్త అంగీకరించాడు. ఫస్ట్ నైట్ గాయాల వల్లే ఆమె మరణించిందని, ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి మరణం దాకా వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి సోదరుడు డిమాండ్ చేశారు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది.