INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తులేదని, చివరకు ఆ పార్టీ 40 స్థానాలైనా గెలుస్తుందా.? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇక మమతా దారిలోనే ఆప్ కూడా నడుస్తోంది.
Read Also: PV Narasimha Rao: పీవీని కాంగ్రెస్ అవమానించిందా.? అంత్యక్రియల్ని సమయంలోనూ రాజకీయమేనా..?
ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తాకింది. జయంత్ చౌదరి ఆర్ఎల్‌డీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుపెట్టుకుంది. సీట్ల ఒప్పందంలో భాగంగా.. ఆర్ఎల్‌డీ రెండు లోక్‌సభ స్థానాలైన బాగ్‌పత్, బిజ్నోర్‌లో పోటీ చేస్తుంది. రాజ్యసభ సీటు హామీ ఇచ్చింది. విలేకరులతో మాట్లాడిని జయంత్ చౌదరి.. దేశ ప్రజల నాడిని ప్రధాని నరేంద్రమోడీ అర్థం చేసుకున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయలేనిది మోడీ దార్శనికత సాధించిందని కొనియాడారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో జయంత్ చౌదరి ఆర్ఎల్‌డీ ప్రభావం ఉంది. జాట్ కమ్యూనిటీలో ఈ పార్టీకి మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆ ప్రాంతంలో పొత్తతో బీజేపీ బలపడాలని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకాల విషయంలో లుకలుకలు సమసిపోవడం లేదు. జనవరి నెలలో ఆర్ఎల్‌డీకి అఖిలేష్ యాదవ్ ఏడు సీట్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ.. ఏయే సీట్లనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో, బీజేపీతో పొత్తు కుదిరింది.