Uttar Pradesh: బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే.. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో స్కార్పియో కారులో వస్తుండగా, బోదాపూర్ గ్రామం నుంచి బయలుదేరి గ్రామ మలుపు వద్దకు చేరుకోగానే.. పెళ్లి కార్డు ఇస్తామంటూ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఆగంతకులు కారును ఆపారని తెలిపారు. మంత్రి కారు కిటికీ తెరువగానే ఓ దుండగుడు పిస్టల్ తీసి నాలుగుసార్లు కాల్చాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు పేర్కొ్న్నారు. కాగా.. గాయపడిన మంత్రి ప్రమోద్‌ను గ్రామస్థులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read
కాగా.. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఈ హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే జౌన్‌పూర్ లోక్‌సభ అభ్యర్థి కృపా శంకర్ సింగ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పుష్పరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!