ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సురేష్ శర్మ నగర్‌లో పదేళ్ల క్రితం జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో జడ్జి కీలక తీర్పు ఇచ్చారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ తల్లి, సోదరుడు, కోడలును హత్య చేసిన ఛాయ్‌మార్ గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది దుర్మార్గులకు మరణశిక్ష విధించారు. అంతేకాకుండా.. దుండగులు దోచుకున్న బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారం వ్యాపారి జీవిత ఖైదు విధించారు. ఈ నిర్ణయంతో బాధితురాలి బంధువుల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
Read Also: Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ.?
2014 ఏప్రిల్ 20న జరిగిన దోపిడీ మరియు హత్య కేసులో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది నేరస్థులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు రవికుమార్ దివాకర్ మరణశిక్ష విధించింది. ఒక బంగారం వ్యాపారికి జీవిత ఖైదు పడింది. 10 ఏళ్ల క్రితం ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో జరిగిన దోపిడీలో దుండగులు హత్యకు పాల్పడ్డారు. ఇందులో ఆదాయపన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ తల్లి, సోదరుడు, కోడలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఛైమర్ హసీన్ గ్యాంగ్‌కు చెందిన తొమ్మిది మందికి ప్రత్యేక న్యాయమూర్తి ఫాస్ట్ ట్రాక్ కోర్టు రవికుమార్ దివాకర్ శిక్షలు ఖరారు చేశారు.
Read Also: Pakistan: కోర్టులో సరండర్ కానున్న నవాజ్ షరీఫ్ కుమారులు
బరేలీకి చెందిన కుడ్లా నగారియా, షెర్‌ఘర్ పట్టణానికి చెందిన వాజిద్, డేరా ఉమారియాకు చెందిన హసీన్, యాసిన్, నజీమా, హషిమా, జుల్కం, ఫేమ్ అలియాస్ శంకర్, బుక్నాలాకు చెందిన సమీర్ గా గుర్తించారు. బంగారం వ్యాపారి రాజు వర్మగా గుర్తించారు. కోర్టు తీర్పు అనంతరం.. పదేళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబీకులు తెలిపారు. తమ కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా హత్య చేసిన వారికి ఇప్పుడు మరణశిక్ష పడుతుందంటే చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు.